Editorial

చైతన్యం సంకల్పబలం పత్రిక పాఠకులకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పండుగ ప్రాధాన్యత

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మ కల్పం అంటారు. ఇలా ప్రతీ కల్పం లోను మొదట వచ్చే పండుగ ‘యుగాది’ అని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ చైత్ర మాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుండి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం.

ఈ ఉగాది పండుగ రోజున అందరు తల స్నానాలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఇంటి ముంగిట ముగ్గులు వేసి వసంత లక్ష్మికి స్వాగతం పలకడం చేస్తూ ఉంటారు. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి, తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉగాది పచ్చడి తింటారు. ఈ పచ్చడి వైద్య పరంగా కూడా వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుందని అంటారు.

ఇక ఉదయం వేళ లేదా సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగ రోజున అందరూ కలిసి పండితులను ఆహ్వానించి, వారిని సన్మానించి, పంచాంగ శ్రవణం చేయడం కూడా జరుగుతుంది. సంవత్సరం లోని శుభ అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేం దుకు మొదలు పెడతారు. ఈ పంచాంగ శ్రవణం వలన మానవునికి సంపద ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్య ఫలం వస్తాయని విశ్వసిస్తారు.

సర్వోన్నత పీఠం పై తెలుగు తేజం

తెలుగు జాతి ఖ్యాతిని చాటుతూ 48 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా శ్రీ ఎం. వి. రమణ ఈ నెల 24 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

గా కొనసాగుతారు. 4 దశాబ్దాల అనంతరం మరల తెలుగు తేజం ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించడం నందిగామ బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో అభ్యసించిన అయన తోటి స్నేహి తులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి

దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి యాదగిరి గుట్టలోని “లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. మే నెలలో తిరిగి పునః ప్రారంభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మంజీరా లోని గోదాఝరి

హల్దీ కాలువకు కొండ పోచమ్మ నీటిని విడుదల చేసిన కేసీఆర్.

మన తెలంగాణా గద్వేల్ – కాళేశ్వరం నీటితో నిండిన కొండపోచమ్మ రిజర్వాయరు నుండి గోదావరి జలాలు హల్దీ కాలువలోకి విడుదలతో, మరో చారిత్రాత్మక ఘట్టం మంగళవారం ముఖ్య మంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. దీనితో గోదావరి జలాలు మంజీరా నది లోకి పరుగులు పెట్టాయి. ఈ ప్రక్రియతో తెలంగాణాను కోటి ఎకరాల మాగాణి గా అభివృద్ధి చేయాలనే తలంపుతో సాగునీటి

ప్రాజెక్ట్ రూపకల్పన సీఎం.కేసీఆర్ కార్యాచరణ కీలకమైన మైలురాయి దాటింది. ఈ హల్దీ కాల్వలోకి 1600ల క్యూసెక్కుల నీటిని విడుదల విడుదల చేయగా 5 నుంచి 10 రోజులలో ఈ వాగు నుండి మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్య క్రమానికి సియం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తదనంతరం కొండ పోచమ్మ సాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుండి సిద్ధిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు.

టాప్ 20 లో అవార్డులు

టాప్ 20 లో “గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డుకు తెలంగాణా గవర్నర్ తమిళ్ ఇసై సౌందర్య రాజన్ ఎన్నికయ్యారు. అలాగే టాప్ 20 లో నే “గ్లోబల్ వుమెన్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా ఎన్నికవ్వడం విశేషం, హర్షదాయకం. వారితో పాటుగా మరో 18 మంది ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.

దేశీయ వార్తలు – కరోనా ఉధృతి

భారత దేశంలో కరోనా ఉధృతంగా ఉంది. ఒక్క రోజులోనే లక్ష కేసులు దాటితే ముందు ముందు ఎలా ఉంటుంది అని మనం ఆలోచించుకోవాలి. మనకి ఉన్న జనాభాకి ఉన్న ఇన్ఫరాస్ట్రక్చర్ ఎంత? అందరూ కరోనా తగ్గిపోయింది అని మాస్కులు లేకుండా కూడా లేకుండా తిరగడం మొదలు పెట్టారు. కరోనా నిబం- ధనలు పాటించకుండా పార్టీలు అనీ, పెళ్లిళ్లు అనీ నిర్లక్ష్యంగా గుంపులుగుంపులుగా తిరగడం వల్లనే కరోనా మరల విజృంభించింది అని డాక్టర్లు చెబుతున్నారు.

ఏప్రిల్ రెండో వారం వచ్చేసరికి పీక్ స్టేజ్ కి చేరుకుంటాం అంటున్నారు. మనం చేస్తున్నదేమిటి?

బయట చూస్తే కరోనా ఉన్నట్టే కనిపించదు. స్టాటిస్టిక్స్ చూ స్తే లక్ష దాటింది. మనకి ఉన్న హెల్త్ ఇంఫ్రాఆస్టక్చర్ ఎంత ? సామాజిక దూరం పాటించరు ఒక వాక్సినేషన్ తీసుకోగానే, మాస్కులు దింపేసి బయటకి తిరుగుతున్నారు. రోడ్ల మీదే ఉంటున్నారు. మార్చిలో 14, 15 తేదీల్లో చూస్తే ఇప్పుడున్న వాటిలో 10 శాతం కేసులు కూడా లేవు. అంటే 10 రోజుల్లోపల 10 రేట్లు పెరిగాయి హాస్పిటల్స్ నిండి పోయాయి. ఇన్ఫ్రా స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది.

శార్వరీ నామ సంవత్సరంలో అంటే 14 నెలలుగా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు అందరికీ తొలగి పోయి, ఈ ప్లవ నామ సంవత్సరంలో (ప్లవ అంటే తెప్ప అని అర్థం) ప్రతీ ఒక్కరు ఎవరి జాగ్ర త్తలో వారు ఉంటూ అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటోంది చైతన్యం సంకల్పబలం.

సర్వేజనా సుఖినోభవంతు

ఉగాది శుభాకాంక్షలతో,

మీ ఎడిటర్,

తీగవరపు శాంతి

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.