ఉగాది

చైతన్యం పాఠకులకు, ప్రేక్షకులకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాలను సమకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముక్కలు, యూ రస,కొత్త

ఉగాది మన తెలుగువాళ్ళ నూతన సంవత్సరము. ఈ ఉగాది ఒఅందుగ తెలుగు లోగిళ్ళలో ఉగాది పచ్చడితో ప్రారంభం అవుతుంది. ఈ ఉగాదితి ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఈ ఉగాది పచ్చడిని కొత్త మట్టి కుండలో చేసేవారు. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. దీనిని ఎలా తయారుచేస్తారు అంటే మామిడిముక్కలు, చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు, వేపపువ్వు, కొత్త చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం.

ఈ సీజన్ లో కొత్త చింతపండు, కొత్త బెల్లం వస్తాయి కాబట్టి చింతపండు రసంలో బెల్లం ముక్కలు కలిపి మిగతా పదార్థాలన్నీ కలిపి చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం మరియు తీపి – ఈ ఆరు రుచులతో ఈ పచ్చడిని తయారుచేస్తారు. జీవితంలో మనకు ఎదురయ్యే రకరకాల అనుభవాల ద్వారా మనం చక్కని వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దపడతామని ఈ పచ్చడి ద్వారా మనకు తెలియజేసారేమో!

మా అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి చుట్టుప్రక్కల వారంతా వచ్చి అడిగి తీసుకుని వెళ్లేవారు. ఉగాది రోజు నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా మనకు వుంది. ఎన్ని పిండివంటలు చేసినా మా మామయ్యలు ముందుగా వేడివేడి అన్నంలో ఈ ఉగాది పచ్చడిని వేసుకుని తినేవారు. అవన్నీ తియ్యని జ్ఞాపకాలు నాకు. ఈ ఉగాదితో మీకూ ఇలాంటి ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉండే ఉంటాయి కదూ!

మరోసారి అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.