అభిప్రాయవేదిక

1. మహిళాశక్తి గురించి ఎడిటోరియల్ బాగా వ్రాశారు. వైద్యోనారాయణో హరి: అనే శీర్షిక చాలా బావుంటోంది. ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్న ఆ డాక్టర్లకు ధన్యవాదాలు తెలపండి.

హగ్ బాస్ హంగామా భువనచంద్ర గారు వ్రాసిన కధ చదువుతున్నంత సేపూ నవ్వాగలేదు. వారు ఏది వ్రాసినా చాలా బావుంటుంది.

శ్రీ చంద్ర శేఖర్ , శ్రీమతి వనజ — ఏలూరు. శ్రీ శ్రీరామ్, శ్రీమతి సుజల — కర్నూలు. శ్రీమతి మణి, శ్రీమతి భువనేశ్వరి —- సికింద్రాబాద్.

2. దశమగ్రహం కాదు శ్రీ ఎలక్ట్రాన్ గారు వ్రాసిన కధ కుచేలుడి పిల్లలతో పోలుస్తూ, కుటుంబ నియంత్రణని సూచిస్తూ, పిల్లల బాధ్యతలు ఎలా తీర్చారు? వంటి అనేక విషయాలతో కధ చాలా బావుంది.

ప్రజలను చైతన్య పరుస్తూ వేదుల సుబ్రహ్మణ్యం గారు వ్రాస్తున్న వేదులాన్వయ పలుకు పద్యాలు చాలా బావుంటున్నాయి.

శ్రీ రామచంద్రరావు, శ్రీ మోహనరావు — కాకినాడ. శ్రీమతి సుజాత, శ్రీరమణ్ —- వేములవాడ. శ్రీమతి భారతి, శ్రీమతి సుమ —- ఏలూరు. శ్రీమతి శ్రీలత, శ్రీమతి శిరీష, శ్రీ కృష్ణ —– పిఠాపురం.

3. పూరీ జగన్నాధ వైభవం గురించి పోచినపెద్ది మురళీ కృష్ణ గారు చాలా బాగా వ్రాస్తున్నారు. విగ్రహ ప్రతిష్టకి బ్రహ్మ రావడంతో సహా అన్నీ కళ్ళకి కట్టినట్లు వ్రాస్తున్నారు.

సప్త మోక్ష నగరాలు లో మాయ ( నేటి హరిద్వార్) అంటూ హృషీకేశ్ దర్శనం, ఆధ్యాత్మిక చింతన, విదేశీయులు యోగా నెర్కకోవడంతో సహా అనేక విషయాలు చక్కగా తెలియ జేశారు.

శ్రీ సుబ్రహమణ్యం, శ్రీమతి లక్ష్మి — తణుకు. శ్రీ కరుణాకర్, శ్రీమతి నిర్మల —- బొంబాయి. శ్రీమతి కనక. శ్రీ సుధాకర్, శ్రీమతి పావని —- తణుకు. శ్రీమతి సుందరి, శ్రీ సురేష్ — రాజమండ్రి.

4.పరిపూర్ణ స్త్రీ లో అందరూ ఉన్నారు. ఖండాంతరాల్లో భారత దేశ ఖ్యాతిని విస్తరింపజేసిన స్వామీ వివేకానందునికి దిశా నిర్దేశం చేసింది ఆయన తల్లే. ఇలా ఎందరో స్త్రీ మూర్తులున్నారు అంటూ స్త్రీ గొప్ప తనం గురించి పోడూరి గారు చాల బాగా వ్రాసారు.

నూట పదహారు కందాల్లో సుందర కాండ అంటూ పాలెపు బుచ్చిరాజు గారు పద్యంతో పాటు తాత్పర్యం కూడా చక్కగా వివరిస్తున్నారు.

శ్రీమతి సరోజ, శ్రీ బాబురావు , శ్రీమతి కల్పన — పూనా. శ్రీ కనకారావు, శ్రీ సుబ్రహ్మణ్యం , శ్రీమతి పల్లవి —– ఆస్ట్రేలియా. శ్రీమతి శుభ , శ్రీ అరుణ్ —సికింద్రాబాద్.

5. వేమూరి గారు వ్రాస్తున్న కధల్లో ఈ నెల వ్రాసిన ట్రాయ్ మహా సంగ్రామం కధలో ఒక వివాహ సందర్భంలో చేసిన విందులో జూస్ ఏరిస్ ని విందుకు పిలవక పోవడంతో ఆత్మాభిమానం దెబ్బ తిన్న ఏరిస్ బంతి భోజనాల మధ్యకి బంగారు యాపిల్ పండుని విసిరి వెళ్ళిపోతుంది అంటూ అద్భుతంగా వ్రాసారు. ప్రతీ నెల అంత అద్భుతంగా వ్రాస్తున్నారు.

ప్రేమంటే ఇంతే లో ఇంద్రగంటి వెంకట సుబ్బారావు గారు వ్రాస్తున్న సీరియల్ సస్పెన్స్ తో చాల బాగా వ్రాస్తున్నారు. లావణ్యాన్ని పెళ్లి కూతురుని చెయ్యడం, అందరూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం లాంటి కథ అందిస్తూ మమ్మల్ని అందరినీ పెళ్లి వారిని చేశారు.

శ్రీమతి అనసూయ , శ్రీమతి రుక్మిణి, శ్రీ సుధాకర్ — ఖమ్మం. శ్రీ కిరణ్ , శ్రీ వంశీ, శ్రీమతి గీత —- రాయపూర్. శ్రీమతి కమల, శ్రీ సుబ్బారావు, శ్రీమతి అపర్ణ — తాడేపల్లి గూడెం.

6. సనాతన (హైందవ) ధర్మంలో మహిళ అంటూ మహిళ గురించి మనుస్మృతి లో ఇలా చెప్పారంటూ, అలాగే పోతన భాగవతం లోని పద్యాలను ఆధారంగా చేసుకుని స్త్రీ మూర్తి గౌరవాన్ని పెంచే విధంగా వ్రాసారు హరగోపాల్ గారు.

ఆదూరి హైమవతి గారు నవ విధ భక్తులు గురించి వ్రాస్తూ, ఈ నెల పాద సేవనం గురించి బాగా వ్రాసారు. లక్ష్మీ దేవి నారాయణుని పాద సేవ, తల్లీ గురువులకూ పాద సేవ చేయడం బాగా వ్రాసారు.

శ్రీమతి సుందరి, శ్రీ మధు, శ్రీ ప్రకాష్ —- కడప. శ్రీమతి మాధవి, శ్రీ లక్ష్మి, శ్రీమతి రేణుక — కాకినాడ. శ్రీ వెంకటేశ్వర రావు, శ్రీ వేణు గోపాలరావు, శ్రీమతి ప్రభ —- ఓడలరేవు.

7. మా ఊరి నందుల కథ ఎంతో ఆత్మీయంగా వ్రాస్తున్నారు నందుల ప్రభాకరశా’స్త్రి గారు. రాజకీయ నాయకులు అంటూ వ్రాస్తూ ‘పలుగురాళ్ళ పల్లె’ రాజకీయాలు గురించి వ్రాస్తూ ఆ ఊరు తీసుకుని వెళ్లారు మమ్మల్ని. పల్లె వాతావరణంలో కూడా ఎలా ఉంటాయో బాగా వ్రాసారు.

భాగవతులతో అనుబంధం గురించి వేంకటాచార్యులు గారు బాగా వ్రాస్తున్నారు. రాక్షస రూపంలో ఉన్న రామ శర్మ అజ్ఞానం తొలగడం, అలాగే పూర్వ జన్మ స్మ్రుతి వీటి గురించి బాగా వ్రాసారు.

శ్రీ ప్రకాశరావు, శ్రీమతి విజయ, శ్రీ సుందరేశ్వర రావు. శ్రీమతి కనక దుర్గ —– రావులపాలెం. శ్రీ రంగారావు, శ్రీ వెంకట్రావు , శ్రీమతి సుమతి —- ఏలూరు .

8. చాగంటి కృష్ణ కుమారి గారు గడి — నుడి ప్రతీ నెల ఎంతో విజ్ఞానదాయకంగా ఇస్తున్నారు. చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటాము. బుఱ్ఱకి పదును పెట్టేదిగా ఉంటోంది.

పద మూడేళ్ళ వయస్సులోనే ఎవరెస్టు ను అధిరోహించిన పూర్ణ మాలావత్ గురించి వ్రాస్తూ పదమూడేళ్ల వయస్సు లోనే ఎవరెస్టు శిఖరాన్ని ఎలా అధిరోహించిందో అన్నిటినీ చాలా బాగా వివరించి వ్రాసారు.

శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీ హర్షిణి , శ్రీమతి వేదవతి, శ్రీ మధు —- చంద్రాపూర్. శ్రీమతి అను, శ్రీ చక్రధర రావు, శ్రీమతి మాలతి — హైదరాబాదు.

9. ఆడవాళ్లు అందంగా ఉంటే అద్భుతాలే అంటూ స్త్రీలు మానసికంగా ఉత్సాహాన్ని పెంచుకుందుకు ఎవరికి ఎందులో ఆనందం కలుగుతుందో అందులో ఆనందాన్ని అనుభవిస్తూ, మానసిక వత్తిడిని తగ్గించుకుందుకు ప్రయత్నించాలి. దాని వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అంటూ చక్కటి సూచనలతో భారతి గారు బాగా వ్రాసారు. అందమైన కవర్ పేజీలతో చాలా మంచి పత్రికను తీసుకు వస్తున్నారు.

శ్రీ పల్లం రాజు,శ్రీమతి అరుణ — రామగుండం. శ్రీమతి సుగుణ, శ్రీ మూర్తి, శ్రీమతి అనిత — కిర్లంపూడి. శ్రీ కోటేశ్వరావు, శ్రీ ప్రభాకరరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి —- ఖాజీపేట.

పాఠకులకందరకు ఉగాది. శుభాకాంక్షలు

తీగవరపు శాంతి

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.