సంపాదకీయం

కరోనా —– చైతన్యం

ప్రపంచ వ్యాప్తంగా “కరోనా వైరస్” ప్రజలందరినీ, పెద్ద ఎత్తున భయ కంపితులను చేస్తోందనడంలో సందేహం లేదు. అంతేకాదు కుల మత జాతి ధన పేద వివక్ష చూపించక, నాకు అంతా సమానమే అంటోంది. దాని తీవ్రతకు తట్టుకో గలిగే వారు తట్టుకుంటున్నారు. తట్టుకోలేనివారు దిక్కు లేని వారు ప్రాణాలు వదలడమే కాకుండా, కొందరైతే భార్య, కుటుంబంతో సంబంధం లేకుండా ఆఖరి చూపు కూడా దక్కక, దహన సంస్కారాలు జరిగి పోతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఒంటరిగా మిగిలి పోతున్నాయి. ఎన్నో కుటుంబాలు తల్లి తండ్రి లేని పిల్లలుగా అనాధ పిల్లలు దిక్కు లేని వారుగా ఏడుస్తుంటే, కొన్ని కుటుంబాలలో సంపాదించే వారు కాస్తా చని పోయి, ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్నారు.


లక్షల అడ్వాన్స్ — రికమండేషన్ (ప్రయివేటు ఆసుపత్రులు)

కరోనా రోగం వచ్చి ఆ విధంగా బాధ పడే వారి బాధ వర్ణనాతీతం. ఆ రోగం తట్టు కోవడం ఆంత సులభం కాదు, ఆ జ్వర తీవ్రతను కానీ, ఆ వచ్చే ఆయాసాన్ని కానీ ఆ కరోనా వైరస్ వల్ల రోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారి పరిస్థితి అలా ఉంటే, కుటుంబంలో ఆర్ధిక పరిస్థితి బాగా ఉన్నవారైతే కొంత వరకు పరవాలేదు. ప్రయివేటు ఆసుపత్రిలో అన్నివైద్య సౌకర్యాలు ఉన్న చోట వైద్యం చేయించుకుని (అది కూడా పెద్దల రికమండేషన్ ఉంటేనే బెడ్ దొరుకుతుంది) లక్షలు అడ్వాన్స్ గా చెల్లించి కొందరు తిరిగి ఇళ్లకు వస్తున్నారు. కొందరు అయితే లక్షలు పోయి, మనుషులు పోయి కుటుంబాలకు ఫర్లాంగ్ దూరం నుండి ముఖం చూపించి, అక్కడే అంత్య క్రియలు నిర్వహిం చేస్తున్నారు. అలా అంత్య క్రియలు నిర్వహించడం వారి తప్పు అని కుడా అనలేం. ఎందుకంటే వైరస్ వ్యాధి అలా ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రి అంటే అనారోగ్యం పాలైన ప్రజలు వారి ఆరోగ్యం సరి చేసుకుందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు. అవి ప్రజలందరి కోసం కాకుండా ఒక్క పేద వారి ఆసుపత్రుల్లా తయారయ్యాయి అనేది ప్రజల ఆ వేదన. అక్కడ రోగులకు కావలసిన సదు పాయాలు కానీ, వారి ఆరోగ్య పరీక్షలు చేసే పరికరాలు కానీ సరి పడా లేక ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నాము అంటున్నారు. అంతే కాదు ఆ డాక్టర్లు కూడా మమ్మల్ని సరిగా పట్టించు కోవడం లేదు అనేది కూడా వారి ఆరోపణ. కరోనా వచ్చిన వారు ఒంటరి వారుగా బాధ పడి, భయ పడి, వారి దగ్గరగా వెళ్లి, వాళ్ళ ఆలనా పాలనా చూసే వారు లేక కరోనా జ్వర బాధకి సాయం ఈ బాధ కూడా తోడవ్వడంతో బాధ భరించలేని వారుగా, ఒంటరి వారుగా, కొందరు ప్రాణాలు పోగొట్టు కుంటున్నారనడం సందేహం లేదు. కానీ … రోగులు కూడా ఇక్కడ అర్ధం చేసుకుని ధైర్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కరోనా రోగుల దగ్గరకే వెళ్ళ డానికి భయపడే అంటు వ్యాధిలా ఉంది. అలాంటిది ఆ డాక్టర్లు వైద్యం చెయ్యడమే వారు తమ ప్రాణాలను పణంగా పెట్టడం లాంటిది. కానీ అంత చేసే డాక్టర్లు కూడా రోగులందరినీ సమానంగా చూడడం, అందరిలో ఉండే ప్రాణం ఒకటే కదా! అనే భావన ఎల్లప్పుడు ఉండి వారు కూడా తగిన వైద్యాన్ని అందించ వలసిన బాధ్యత కూడా వారిపై ఉంది. కానీ ఇక్కడ డాక్టర్లు , ప్రభుత్వం మమ్మల్ని సరిగా పట్టించు కోవడం లేదని, డబ్బున్న వాళ్ళకే సకల సదుపాయాలూ అనే ఆరోపణలు ప్రజలు చేస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో భయం ఏర్పడింది. దీనికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మరొక పక్క లాక్ డౌన్ లో అన్నీ మూతబడి ఉండడం వల్ల ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయారు చాలా మంది. ధనంతో ప్రభుత్వం కుడా పేదలకు చాలా సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తోంది. కానీ జనాభా ఎక్కువైన మన దేశంలో, ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా ఇవ్వడం అలవాటు చేసింది. అది ఎంత వరకు వచ్చిందంటే, నిజంగా అర్హులయిన వారు అందుకుంటున్నారా? అంటే అది కొంత వరకూ ప్రశ్నార్ధకము అవ్వ డమే కాక, కొందరు సోమరి పోతులుగాను, తాగు బోతులుగాను తయారవుతున్నారు. అనేది కుడా కొందరి ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది ప్రజల ఆవేదన. ప్రజల అవసరాలకు మేము కట్టే పన్ను సొమ్ము వారి అవసరాలకు మాత్రమే అందాలి అనేది కూడా ప్రజల ఆవేదన. ప్రజలు కష్ట పడి పని చేసేటట్టు, దేశం అభి వృద్ది చెందేటట్టు పధకాలు రూపొందించాలి అని, ప్రజల సొమ్ము ఆ విధంగా వినియోగించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మరొక పక్క మేము వరదల్లో మునిగి, పంటలు అన్నీ నీళ్ళల్లో మునిగిన వారు మేము నిరాధారంగా ఉండి, తిండీ తిప్పలు లేక ఇబ్బంది పడుతున్నామని కొందరు. ఈ విధంగా దేశంలో రక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్లో దేశం అల్లకల్లోలంలో ఉంటే తూర్పు లద్దాక్ లో మరోసారి చైనా సైన్యం దూకుడు మొదలు పెట్టింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉల్లంఘించి ఆక్రమణకు ప్రయత్నించింది చైనా. చైనా సైనిక బలగాలను భారత్ సైనికులు నిలువరించారు. 29 న రెండు దేశాల సైనికులు ఘర్షణ దృష్ట్యా చుషూర్ లో కమాండర్ స్థాయి అధికారుల భేటీ. ఈ చైనా చూస్తే ఎక్కిడి కక్కడ ఆక్రమించడం పనిగా పెట్టుకుంది.

షబ్బీపై నిషేధం విధించిన భారత్ —— చైనా తీవ్ర ఆందోళన

బీజింగ్ సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్ ను దెబ్బ కొట్టేలా షబ్బీ సహా 118 యాప్ లను భారత్ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ చర్యలు చైనా పెట్టుబడిదారులు సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్దమైన ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండి పడింది. ఈ మేరకు చైనా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోఫెంగ్ మీడియా తో మాట్లాడారు. ఈ తప్పును భారత్ సరి చేసుకోవాలని చైనా కోరుకుంటోందని తెలిపారు. జూన్ నెలలో గాల్వాన్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో, యువతలో విశేష ఆదరణ పొందిన ప్రముఖ గేమింగ్ యాప్ షబ్బీ, టిక్ టాక్, యూసీ బ్రౌజర్ సహా మొత్తం 118 యాప్ లపై ఎక్కడి కక్కడ శత్రు దేశాలను పెంచు కుంటూ, ఆక్రమణలు చేద్దామనే దురాశతో తమ సైన్యాన్నే కాక, వివిధ దేశాలు సైన్యాలను కోల్పోతుంటే, చివరికి తమ దేశంలో అంతః కలహాలను కూడా కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తోక ముడిస్తే అందరికీ మంచిది . ఈ కరోనాకు కూడా నవంబర్ 1 వ తేదీ కల్లా మందు వస్తుందని అమెరికా చెపుతోంది . ఎదురు చూద్దాం అందరం. . 

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.