శ్రీ వచన భూషణం
వేదములు జ్ఞాన విజ్ఞానములను అందిస్తూ సమాజంలో మానవుల సత్ ప్రవర్తనే సమ సమాజ స్థాపనకు కారణమౌతుందని పెద్దలు తెలియజేస్తారు. అట్టి వేదాలను శ్రీమన్నారాయణుడు తన నాభి కమలమునుండి బ్రహ్మను సృజించి వేదాలు అందించి జీవీ సృష్టితో పాటు వేదవ్యాప్తికి కృషి చేయమని ఆదేశించాడు. ప్రజల జీవన విధానానికి వేదం మరింత చేరువ కావాలని వాల్మీకి, వ్యాసుని వంటి అవతారాల ద్వారా రామాయణ, భారత్, భాగవత గ్రంథాలు, పురాణాలు, ఉపపురాణాల ద్వారా వేదసారము అందరికీ తెలియాలని అనేక వ్యాఖ్యానాలు అందించాడు. వైకుంఠంలోని నిత్యా సూతుల గోష్టి లోని సభ్యులను శ్రీమన్నారాయణుడు భూమిపై అవతరింపజేసి ఈ భూమిపై వాడుకలోనున్న అన్ని వ్యవహారిక భాషలలో వేదసారాన్ని తర్జుమా చేయించి అందించుట చాలావరకు జరిగింది. ముఖ్యంగా ద్రవిడ భాషలో ఆళ్వారాచార్యులుగా అవతరించి వేదసారాన్ని నాలాయిర దివ్య ప్రబంధాలుగా అందిస్తే వాటిని మరింత విస్తారంగా, మంత్రం సారములుగా అనేక పాశురాలలో మరింత విస్తరించి వ్యాఖ్యానములు అందించుట జరిగింది. అట్టివారిలో పిళ్ళైలోవాచార్య స్వామివారు ఒకరు. వీరు వడక్కు తిరువీధి పిళ్ళై గారి కుమారులు. వీరి స్వస్థలం ముడుంబై అనే నగరం. అయితే వీరు బాల్యంలోనే శ్రీరం గం వచ్చి, అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
భగవద్రామానుజుల తదుపరి ఆచార్య పీఠాన్ని వరుసగా ఎంబార్, పరాశర భట్టార్, నంబేయర్ తదుపరి నంబిళ్ళె స్వీకరించారు. నంబిళ్ళె గారిని వడక్కు తిరువీధి పిళ్ళై ఆచార్యులుగా భావించి తన కుటుంబ సభ్యులను కూడా మరచి ఆచార్యసేవలో గడిపేస్తున్నారు. వీరిది బాల్యవివాహం. భార్య యుక్త వయస్కురాలై కాపురానికి తన ఇంటికి వచ్చి చేరిందని తల్లి అనేక మార్లు కబురంపినా గృహస్థు ధర్మం పట్ల అంతగా ఆసక్తి లేక ఇంటికి రాకుండా ఆచార్య సేవలోనే ఉంటున్నారు. దాంతో వీరి తల్లిగారు కోడలు శ్రీరంగ నాచ్చియారులతో కలిసి నంబిళ్ళె గారిని సేవించి మీ శిష్యుడైన నా కుమారుని దిద్దుబాటు చేసి సత్ సంతానంతో మా వంశాభివృద్ధికి తమ మంగళాశాసనములు జేయాలని కోరారు. దాంతో నంబిళ్ళె వరకు తిరువీధి పిళ్ళైని పిలిచి భార్యతో కలిసి తనకు నమస్కరించమని కోరి, నమస్కరించగా ‘శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు’ అంటూ మంగళాశాసనములు అందించి నా మాట నిజం చేయాలని ఆదేశించారు.
క్రోధి నామ సంవత్సరం తులామాసం శుక్ల దశమి, 1206 సం|| లో శ్రవణ నక్షత్రంలో కుమారుడు అవతరించగా వారికి తన ఆచార్యుల నామధేయం పిళ్ళై లోకాచార్యులు అని పేరు ఉంచి, తన గురువుగారి చెంతకు చేరగా, ‘నేను నా కుమారునకు ఒక పేరు పెట్టాలని భావించా…. నా కోరిక నెరవేరుటకు మీ దంపతులకు ద్వితీయ కుమారుడు అవతరించాలని మంగళాశాసనములు కృప చేయగా, ఫలితంగా కలిగిన కుమారుని గురువుగారికి చూపగా అళగియ మవాళ పెరుమాళ్ నాయర్ (సుందర జామాతృ ముని) అని పేరు పెట్టారు. ఇరువురు కుమారులు రామలక్ష్మణులవలె కలసి మెలసి యుంటూ తండ్రి నుండి జ్ఞాన, భక్తి వైరాగ్యములు ఆచార్యులైన నంబిళ్ళె వారి నుండి సకల వేదం వేదాంత శాస్త్రములు, సాంప్రదాయ గ్రంథ రహసస్యములు సేవించి గృహస్థాశ్రమము స్వీకరించకుండా ఆది శంకరులు, నేటి త్రిదండి శ్రీమన్నారాయణ్ చినజీయర్ స్వామివారి వాలే ఇరువురూ సన్యాశ్రమము స్వీకరించారు.
వీరిని ఆశ్రయించి సమాశ్రయణములు పొందినవారిలో శ్రీశైలేశులు మరియు మనవాళ మహామునుల తండ్రి తిరునావుడై యాపిరాన్ తాదరన్నర్ కూడా ఉన్నారు. వీరు దివ్య ప్రబంధముల సారమును భక్తి గళవారంతా సులభంగా గ్రహించగలిగే అష్టాదశ రహస్యములుగా అందించారు. వీటిని రెండు రకములుగా పెద్దలు విభజించి తెలియజేశారు. అవి 1)జ్ఞాన ప్రతిపాదిత గ్రంథాలు, 2) అనుష్టాన ప్రతిపాదిత గ్రంథాలు. అనుష్టాన ప్రతిపాదిత గ్రంథాలలో ఉత్తమమైనది ‘శ్రీ వచన భూషణం’ అని జ్ఞానులు కీర్తించారు. ఈ గ్రంథం ఒక మహా మహిమాన్విత గ్రంథంగా భగవద్రామానుజుల అవతారంగా కీర్తింపబడే మనవాళ మహామునులు తన ‘ఉపదేశ రత్నమాల’ లో తెలియజేశారు. ఈ గ్రన్థసాన్ని గురుముఖత అభ్యసించి ఆచరించేవారి తేజస్సు బ్రహ్మ తేజస్సును పోలి ఉంటుందని భాగవతుల నమ్మకం. తేనెటీగ మకరందాన్ని సేకరించి ఒక నిధిగా ఒక చేకూర్చినట్లు పిళ్ళై లోకాచార్య స్వామివారు వేదవేదాంత స్మృతి ఇతిహాస పురాణములు దివ్య ప్రబంధాది విషయములలోని సారవంతమైన ప్రధాన విషయములను ఒకచోట చేర్చి రూపొందించిన గొప్ప గ్రంథంగా ‘శ్రీవచన భూషణము’ను పెద్దలు కీర్తించారు.
కొంతమంది సూయాపరులు ఈ గ్రంథం ధర్మ వ్యతిరేక అంశాలతో నిండియున్నది అసత్య ప్రచారం చేస్తుంటే రంగనాథుడు విని… తానూ ఆమోదించిన గ్రంథంగా లోకులకు తెలియజేస్తే, వారు ఆచరించే అవకాశం ఉందని భావించి, తనకు శ్రీ వచన భూషణ గ్రంథాన్ని పిళ్ళై లోకాచార్య స్వామివారిచే వినిపింపజేయమని అర్చక ముఖతా ఆదేశించగా …. వారు ఇంట లేనందున వారి సోదరులు అళగియ మనవాళ పెరుమాళ్ నాయర్ రంగనాథుని సన్నిధికి చేరి గ్రంథాన్ని స్వామికి చదివి వినిపించారు.శ్రీ రంగనాథుడు ఆనందంతో వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించి పంపమని ధర్మకర్తలు ఆదేశించినట్లు వారు అళగియ మనవాళ పెరుమాళ్ నాయర్ ను సత్కరించినట్లు ఆధారిత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అళగియ మనవాళ పెరుమాళ్ నాయర్ కూడా ‘ఆచార్య హృదయం’ వంటి పలు ఉత్తమ గ్రంథాలను మనకు అందించియున్నారు. వీరు అన్నదమ్ములు ఇరువురూ శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారం కొనసాగిస్తూ అనేకమంది శిష్యులను ఉత్తమ ప్రచారకులుగా తీర్చిదిద్దారు. వీరిలో ‘తీరుతాయారు’ అనే మహిళా కూడా సకల వేదాన్తములను అభ్యసించిన ఆధారాలు వున్నాయి. వీరి ప్రచారంలో ‘రామానుజ సిద్ధాంతం’ సర్వ శాస్త్ర సమ్మతమని అనేక ప్రమాణాలు ఆధారంగా నిరూపిస్తూ ప్రచారం గావించేవారు.
మణల్ పాకం అనే గ్రామం లోని నంబిగారు పిళ్ళై లోకాచార్య స్వామి సాక్షాతూ కంచి వరదరాజుల అవతారంగానే భావిస్తారు. నంబిగారు తాను సేవిస్తున్న గ్రంథాలలో భావాలు వారికి స్ఫురించక ఇతర పండితులను అడగలేక కంచి వారసుని సన్నిధికి చేరి స్వామిని ప్రార్ధింపగా, ఆరోజు రాత్రి కలలో కొంత విషయాన్ని వివరించి, మిగిలిన విషయం మణల్ పాకం అనే గ్రామం లోని నంబిగారు పిళ్ళై లోకాచార్య స్వామి సాక్షాతూ కంచి వరదరాజుల అవతారంగానే భావిస్తారు. నంబిగారు తాను సేవిస్తున్న గ్రంథాలలో భావాలు వారికి స్ఫురించక ఇతర పండితులను అడగలేక కంచి వారసుని సన్నిధికి చేరి స్వామిని ప్రార్ధింపగా, ఆరోజు రాత్రి కలలో కొంత విషయాన్ని వివరించి ,మిగిలిన విషయం ‘నేను నీకు శ్రీరంగనాథుని సన్నిథిలో స్వయంగా కనిపించి తెలిజేస్తాను, ఆ సమయంలో నీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవచ్చు’ అన్నారుట. ఆనాటి నుండి వీరు శ్రీరంగనాథుని సన్నితుకి చేరి తనకు కంచి వరదుడు అందించిన రహస్యార్థాలను నెమరు వేసుకుంటూ స్వామివారి రాకకు ఎదురుచూస్తున్నారు. ఒకరోజు మనల్ పాకం నంబిగారు కూర్చున్న చోటు ప్రక్కన ఖాళీ స్థలం ఉంటె అక్కడకు పిళ్ళై లోకాచార్యస్వామి వారు వారి శిష్యులందరితో చేరి…. తనకు కంచి వరదరాజులు చెప్పిన విషయాన్ని. వారి శిష్యులందరికీ వివరించి తనకు శ్రీరంగంలో చెబుతానన్న విషయాన్ని కూడా వివరించి, ఏదైనా అనుమానాలు ఉంటే అడగవచ్చు అని వారి శిష్యులతో పాటు మనల్ పాకం నంబి వైపు కూడా చూశారుట. నంబిగారు ఎంతో ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ ‘మీరు వారేనా’ అన్నారుట. దాంతో పిళ్ళై లోకాచార్యస్వామి చిరునవ్వు నవ్వుతూ వారిని ఆశీర్వదించి అక్కడనుండి ప్రయాణం కొనసాగించారుట. ఆనాటి నుండి మనల్ పాకం నంబిగారు పిళ్ళై లోకాచార్యస్వామి వారు కంచి వరదరాజుల అవతారంగా ప్రచారం చేశారు. విశిష్టాద్వైత సిద్ధాంత వ్యాప్తి రామానుజుల నుండి – ఎంబార్- తదుపరి పరాశర భట్టార్ – తదుపరి నంబీయర్ – తరువాత వారి శిష్యులు నంబిల్లై ఆనాటి వైభవం ఏమాటర్మ్ తగ్గకుండా పిళ్ళైలోకాచార్య స్వామి ఎంతో కృషి చేశారు.
భారతదేశంలో తురుష్కులు దండయాత్రలు జరిపి హిందూ దేవాలయల సంపద దోచుకోవడం, విగ్రహాలను, ఆలయాలను ధ్వంసం చేయడం జరుగుతోంది. ఈ ముప్పు శ్రీరంగనాథుని ఆలయానికి అందలి స్వామి అర్చా స్వరూపాలకు ప్రమాదం రాబోతోందని శిష్యుల ద్వారా ముందుగా గ్రహించి, అప్పటికప్పుడు మూలమూర్తికి రక్షణగా గోడ కట్టించి తొందరగా శ్రీరంగం నుండి బయటపడాలని భావించి శ్రీరంగనాథుని అర్చామూర్తులతో శతృవుల కంటపడకుండా వాటి రక్షణయే ధ్యేయంగా అడవుల వెంబడి నడుస్తూ, దారోలో అనేక కష్టాలు ఎదుర్కుంటూ మధురకు సమీపంలోని జ్యోతిష్కుడి గ్రామం చెడి అర్చామూర్తుల రక్షణకు చక్కని చోటుగా భావించి అక్కడే నివసిస్తూ…. స్వామి స్వరూపములను భద్రంగా శిష్యులకు అప్పగించి, క్రీ.శ. 1311 సం || లో (సుమారు 105 సంవత్సరాలు) శరీరంలో దేవుడు కొనసాగినంతవరకూ పరమాత్మ సేవయే ధ్యేయంగా కొనసాగి పరమపదం చేరారు.
వీరు మనకు అందించిన శ్రీ వచనభూషణం పూర్తి జ్ఞానసారఫలం మరియు ఆచరణ గ్రంథంగా కూడా కీర్తింపబడింది. ఈ గ్రంథం సేవించకుండా ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు సేవించినా సంపాదించే జ్ఞానం పరిపూర్ణ ఫలాన్ని ఇవ్వదని పెద్దలు తెలియజేస్తారు. గాన ఈ గ్రంథాన్ని అస్మత్ ఆచార్య్లు భగవత్ భాగవతుల అనుగ్రహ కటాక్షంతో చక్కగా తెలుసుకుందాం.