శ్రీ ప్లవ నామ సంవత్సరానికి (2021-22) ఆహ్వానం

కాలానికి కొలమానం సంవత్సరం.

కా : అనగా శుభమును

ల : అందించునది.

తెలుగు సంవత్సరాలు అరవై (60)

ప్రభవ : మొదటిది, అక్షయ : చివరిది `

రాబోయేది ‘ప్లవ’ నామ సంవత్సరమ్.

‘శార్వరీ’ (గత ఉగాది) 34వ సంవత్సరము.

‘శార్వరీ’ అంటే రాత్రి.

లక్ష్మీదేవి నామాల్లో ఒకటి ‘శార్వరీ’.

మన ఆయుర్దాయము వంద (100) సంవత్సరాలు.

‘అందుకే శతమానం భవతి’అంటారు.

సంవత్సరంలో ఋతువులు ఆరు (6)

1. వసంతము (Spring), 2 గ్రీష్మము, 3. వర్ష (Rain), 4. శరత్, 5. హేమంతం, 6. శిశిరం

తెలుగుమాసాలు (నెలలు) 12. మొదటిది చైత్రం. పౌర్ణమి (Full Moon), చిత్తా నక్షత్రముతో కూడిన మాసం చైత్రం.

సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. వసంత ఋతువు, చైత్రమాసం (Month) శుక్లపక్షం, పాడ్యమీ తిథిరోజు వచ్చేది ఉగాది.

ఈ సంవత్సరం (2021)లో 13 ఏప్రిల్ మంగళవారం రోజున ‘ప్లవ’ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది.

ఉ : ఉత్తమమైన

గా(గం) : జ్ఞానం (knowledge)

‘ఆది యందు గది, ఉగాది.

సరైన జీవన విధానానికి (Life Style) ఉపకరించే విద్యను నేర్చుకోవడానికి ప్రారంభమైన దినమే ఉగాది.

శాస్త్రప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి తిథి రోజు ఉగాది ఉత్సవ (పండుగ) జరుపుకోవాలి.

వసంత ఋతువు ప్రాశస్త్యమైంది. ‘ఋతునామ్ కుసుమాకర…’` అన్ని ఋతువులో నేను వసంత ఋతువును(శ్రేష్ఠ ఋతువును!)’ అంటాడు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో. పంచ భూతమైన ప్రకృతి వసంత ఋతువులో పులకరిస్తుంది. మోడువారిన చెట్లు చిగురిస్తాయి. కోయిలలు తమ మధురగానాన్ని స్వరాన్ని వినిపిస్తాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మన జీవితాలు ప్రకృతిలో ముడివడినటువంటివి.

ఉగాది పచ్చడి సేవనం

మానవ జీవనంలోని సుఖ`సంతోషాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ ఉగాది పచ్చడికి ప్రతీకలు.

పచ్చడిలో

1.వేపపువ్వు (చేదు), 2. మామిడి (వగరు), 3. కొత్తచింతపండు (పులుపు), 4. మిరియాలపొడి (కారం), 5. మిరప, 6. సైంధవ లవణం (ఉప్పు) ఉండాలి. ఆయుర్వేద రీత్యా వీటికి కఫ, వాత, పిత్త దోషాలను తొగించే లక్షణములున్నాయి. అందువల్ల మన తెలుగు ఉగాది రోజు ఉగాది పచ్చడి సేవనం ముఖ్యమైనది.

పంచాంగ శ్రవణం

మన సనాతన హైందవ ధర్మంలో కాలానికి కొలమానం సంవత్సరం. అయితే మానవ జీవనంపై నవగ్రహాల ప్రభావం ఉంటుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.

పంచాంగం

పంచ : అయిదు, అంగాలు – భాగాలు.

అవి. 1. అధి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.

పంచాంగ శ్రవణం ద్వారా ‘ప్లవ’ నామ సంవత్సరంలో రాబోయే పరిస్థితులను, భవిష్యత్వాణి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మనము మంచి కార్యాచరణ, నడవడి ద్వారా మన కర్తవ్యాన్ని ధర్మాన్ని నెరవేర్చాలని సనాతన ధర్మప్రబోధం.

ఈనాడు మన హిందూ యువతరం తెలుగు పండుగకు దూరమయినట్లుగా కనిపిస్తుంది – మన దేశంలో, విదేశాల్లోనూ. అయితే మూలం (Roots) బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. మన ధర్మంలో ఒక్కో పండుగకు ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. విదేశాల్లో ఉంటున్న మనవారికి మన సంస్కృతీ, సాంప్రదాయాలను, కట్టుబాట్లను సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని తద్వారా మన జీవితాల్లో భాగాలైన ‘ఉగాది’ లాంటి పండుగ విశిష్ఠతను మన యువతకు తెలుపుదాం. తద్వారా ‘వసుధైవ కుటుంబకమ్’.

‘సర్వేజనాః సుఖినో భవంతు’’ అన్న మన ధర్మాన్ని ప్రపంచం నలు దిక్కులా చాటుదాం.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.