సప్త మోక్ష నగరాలు
జీవితం, ముఖ్యంగా మానవ జీవితం గొప్పది. అమూల్య మైనది. ఆధ్యాత్మిక లో చెప్పాలంటే దుర్లభమైనది. కేవలం లౌకిక జీవితాన్ని ఆరాధించే వారి సంగతి పక్కనుంచితే భగవంతుడే పరమావధిగా ఆయనను పొందేందుకే మానవ జీవితం అనే స్పృహ కలిగి, ఆ గమ్యానికే దృఢ చిత్తంతో సమాయతమైన వారికి జీవితం అపురూపమై నది. మానవ జన్మ ఓ దివ్య వరంగా లభించింది. దీనిని దుర్వినియోగం చేసుకోకూడదంటారు మన పెద్దలు. జ్ఞానం లేకుండా ముక్తి లక్తి భించదు. అందుకే మహాపుఋషులను ఆశ్రయించి, ఆత్మ –పరమాత్మ జ్ఞానం పొందాలి. ధర్మార్ధ కామమోక్షాన్ని విడిచి మధ్య ఉన్న అర్ధ కామాల వెంట నేటి మనిషి పరుగులు చేస్తు న్నారు. పరమాత్మ పట్ల చిత్తం అంటే మనసును లగ్నం చేయాలి. మన మనసు ప్రవర్తనను నిరోధించడమే యోగం. ఎన్ని ఒడుడుకులు ఎదురైనా పదిలంగా బతకాలని ప్రతి జీవి తాపత్రయపడుతుంది. అందులో ప్రమాదరహితంగా, ప్రమోద భరితంగా సాగాలనే కాంక్ష అంతర్లీనమై ఉంటుంది. జటిల సమస్యలు ఎదురైనప్పుడు ఏమైనా మహిమాన్విత శక్తి తనకు సహక క్తి రించాలని ఆశించడం సహజం. భగవంతుని అనుగ్రహం పొంది, సమస్యలను అధిగమించగల శక్తి పొందాలనే ప్రయత్నమే — భక్తి మార్గం.
భగవంతుడు అపార కరుణా సముద్రుడు. దయాళుడు. ఆయన మానవునికి సద్బుద్దినిచ్చి సన్మార్గంలో నడిపిస్తా డు. అందరికీ ప్రేరణ ఇస్తాడు. ఆయన ప్రేరణ జగతి జాగృతికి ఆధారం. భవ బంధాలనుండి విముక్తి చేయడానికి ఎన్నెన్నో మార్గాలు చూపాడు. ఎన్నో దివ్య ధామాలను సృష్టించాడు. వేదాలు పుట్టిన ఈ పవిత్ర భూమిపై ముక్తి ధామాలుగా సప నగరాలు ఉన్నాయి. అందు పరమాత్మ అనేక అనేక అవతారాలుగా ఉద్భవించి దుష్ట శిక్షణలు గావించి తన మహిమలతో కృపాదృష్టితో కాపాడుతున్నాడు, మరియు నూతనోత్సాహాన్ని నింపుతున్నాడు.. “అయోధ్యా, మధురా మాయా, కాశీ కంచి అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్ష దాయకా” భారత దేశంలో అనేక దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అయితే సప మోక్ష నగరాలు మోక్ష ధామాలుగా ప్రసిద్ది గాంచి మనందరకూ సుఖ శాంతులు, విజయ కాంతులు ప్రసాదిస్తు న్నాయి. అందువల్ల మనకు ఆధ్యాత్మిక చైతన్యం విరాజమానమై దైవం పట్ల భక్తి ప్రపక్తి త్తులు పెరిగి ఆత్మ విచారణ చేయగలుగుతున్నాము. ధర్మ బద్దమైన జీవనాన్ని ఎంపిక చేసుకుని పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ ముక్తి కోసం ప్రయత్నించడం మన ధ్యేయంగా చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత కాలంలో సప్త మోక్ష ధామాలను దర్శించి పునీతులమవ్వాలి. భగవంతుడు భక్తుని నుండి కోరుకునేది కూడా అదే. ఆసేతు హిమాలయ పర్యంతం వ్యాపించిన మన భారతావనిలో ఎన్నో జాతులు, తెగల ప్రజలు, భాషలు ఉన్నా మొత్తం జాతినంతటినీ సమైక్య పరచి ముందుకు నడిపిస్తోంది మన సనాతన సంస్కృతి. అట్టి సంస్కృతికి ప్రతిరూపాలు మన పుణ్య క్షేత్రాలు, తీర్థాలు. వాటిలో అనాదికాలం నుంచి విఖ్యాతి చెంది భక్తులకు మోక్షదాయికాలుగా ఏడు పుణ్య క్షేత్రాలు అత్యంత ప్రాముఖ్యత పొందాయి.అవి
అయోధ్య, మధుర, మాయ (నేటి హరిద్వార్), కాశీ, కంచి, అవంతిక(నేటి ఉజ్జయిని) మరియు ద్వారక.
2. మధుర
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే
(గత సంచిక తరువాయి)
ఆలయాలలోని కోట్లాది రూపాయల విలువగల సంప ద దోచుకోబడ్డది. అయితే మనవారు వాటిని పునర్నిర్మించి దైవభక్తిని చాటుకున్నారు. ఆలయ శిధిలాలలో లభించిన కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరిచారు. చైనా యాత్రికులు పాహియాన్, హువాన్త్సాంగ్ మధుర క్షేత్ర వైభవాన్ని చక్కగా వర్ణించారు. ఆనాటి పరిపాలనా పద్ధతులు, ఆచార వ్యవహారాల గురించి చక్కగా వర్ణించారు. 8. పవిత్ర స్నానఘట్టాలు: మధురా నగరం యమునా నదీ తీరాన వెలసినది. ఇక్కడ చాలా ఘట్టాలు స్థానికుల నిమిత్తం, యాత్రికుల నిమిత్తం ఏర్పాటు చేయబడినవి. అందులో ముఖ్యమైనవి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. వాటి వెనుక ఆసక్తికరమైన కథలు వున్నాయి. ధ్రువ ఘట్టం: సునీత, ఉత్తానపాదుల కుమారు డు ధృవుడు. ధ్రువుని తన తండ్రి అంకాన కూర్చొనుటకు సవతి తల్లి అంగీకరించలేదు. ధృవుడు కినుక వహించి, యమునా నదీ తీరంలో నారద మహాముని సలహా మేరకు ఘోర తపస్సు గావించి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందాడు. అలా ద్రువునికి విష్ణుమూర్తి సాక్షాత్కారం కలిగిన స్నాన ఘట్టం ‘ధ్రువ ఘట్టం’గా వినుతికెక్కింది.
విశ్రామ ఘట్టం: ఈ ఘట్టమందు శ్రీ మహావిష్ణువు వరాహావతార సమాప్తి సమయమందు, మరియు శ్రీకృష్ణుడు కంసుని వధించిన పిమ్మట అతనికి అంత్యక్రియలు నిర్వహించిన పిమ్మట ఈ ఘట్టంలో విశ్రాంతి తీసుకున్న కారణముగా ఈ ఘట్టం ‘విశ్రామ ఘట్టం’గా పేరు పొందింది. ఈ విశ్రామ ఘట్టమందు ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు యమునా హారతి నిస్తారు. ఇచ్చట యమునా దేవికి, యమునికి గుడి ఉంది. దీనిని పాత గుడిగా వ్యవహరిస్తారు. దీనికి కొద్ది దూరంలో మరో గుడిని కొత్తగా నిర్మించారు. ఆ గుడిలో యమునాదేవి, దేవకీ వసుదేవులు, బలరామ కృష్ణుల విగ్రహాలకు పూజలు జరుపుతారు. అక్రూరఘట్టం: ఈ ఘట్టంలో అక్రూరుడు యమునలో స్నానం చేస్తూ కృష్ణ బలరాములను నది అడుగు భాగంలో కూర్చొని ఉండటం తన కనులారా చూశాడు. అక్రూరుడు ఆశ్చర్యానికి లోనై గట్టు కేసి చూశాడు.
అక్కడ రథం పైన బలరామ కృష్ణులు ఆసీనులై ఉన్నారు. అక్రూరుడు వారిని భగ వత్ స్వరూపులుగా నిర్ణయించుకుని శ్రీకృష్ణుని ప్రార్ధిస్తూ శరణాగతిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇంకా అనేక ఘట్టాలు యోగ ఘట్టం, ప్రయాగ ఘట్టం, కనకాల ఘట్టం, బిండి ఘట్టం, సూర్య ఘట్టం, బెంగాలి ఘట్టం, సంగమ తీర్థం, నవతీర్థ ఘట్టం, అసికుండ ఘట్టం అంటూ పలు స్నాన ఘట్టాలను దర్శించవచ్చును. వ్రేపల్లెలో (గోకులం) కృష్ణుడి లీలలు మధురానగర కారాగారం నుండి యమున దాటి, గోకులం చేరి యశోద వద్ద అల్లారుముద్దుగా పెరిగాడు.
నందుడు తమ బిడ్డకు జ్యోతిష పండితుడైన గర్గముని ద్వారా బాలునికి కృష్ణ యనియూ, రోహిణి గర్భాన జన్మించిన బిడ్డకు బలరాముడని పేరు పెట్టారు. బలరాముడు శ్రీకృష్ణుని అన్నగారు. తల్లులు వేరు. కంసునికి ‘యోగమాయ’ నిన్ను చంపేవాడు మరోచోట పెరుగు తున్నాడు అని హెచ్చరించి అదృశ్యమయింది. కంసుడు పంపగా వచ్చిన దుష్టశక్తులను చిన్న బాలుడిగా ఉన్నప్పుడే హతమార్చాడు. రాక్షస సంహారం పూతనతో ప్రారంభం అయింది. విషంతో కూడిన చనుపాలు ఇచ్చేందుకు వచ్చింది. చన్నులను నోట్లో పెట్టుకుని ఆమెలోని విషాన్ని, శక్తిని హరించి చంపివేశాడు. తదుపరి శకటాసురుడు అంటే సంసారమనే బండి రూపంలో వచ్చి కృష్ణుడి కాలి తాపుకు ఆకాశం నుంచి కూలి అతనిని హతమార్చాడు. తృణావర్తుడు గాలి రూపంలో వచ్చి బాలుని పైకెత్తుకెళ్ళాడు.
అతని మెడ పట్టుకుని వంచి భూమి పైకి నెట్టి చంపాడు. తదుపరి ధేనుకాసుర వధ జరిగింది. అఘము అనగా పాపము. పాపమును తొలగించి ముక్తి నొసంగుటయే అఘాసుర సంహారము. కృష్ణస్వామి యశోదకు పూర్తిగా వశమై స్వంత బిడ్డే అయ్యాడు. ‘కన్నయ్యా మన్ను తిన్నావా! నోరు తెరవమనే’ యశోదమ్మకు నోటిలో అండ పిండ బ్రహ్మాండములన్నియు తన బొజ్జలో ఉన్నా యని కన్నయ్య మహాత్యాన్ని చూపించాడు యశోదకు. ఆమె మనసు నిండా కన్నయ్య చేసిన చిన్నారి చేష్టలే మెదలుతూంటాయి. ఆమె తీరే అంత, ఏ పని చేసినా అతని కొరకే. మాట్లాడినా, పాట పాడినా అతని కొరకే. కన్నయ్య తన తల్లి దగ్గరకు వచ్చి పాలిమ్మని మారాము చేసేవాడు. నిజమయిన భక్తులకు భగవంతుడు వశమవుతాడని భావం. గోకులంలో కృష్ణుని చూపుకు, స్పర్శకు, మాటకు గోపెమ్మలు పరవశించిపోయి ఆలింగనం చేసుకుని ఎద నుంచి పొంగివస్తున్న వాత్సల్య క్షీరాన్ని తాగించేవారు. గోవులు సైతం కృష్ణుడి కోసం తపించసాగాయి.
కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ప్రేమ పొంగు తుంది. ఆయన గోపికల ఇండ్లలోకి వెళ్లి వెన్నను ఆరగించడం శ్రీకృష్ణునికి ఇష్టం. వాళ్ళ ఇళ్ళలో భోంచేసింది వెన్న కాదు. వారి హృదయాలలోని ప్రేమను ఆరగించాడు. నవనీత చోరుడిగా పేరు పొందాడు. ఒక పర్యాయం కన్నయ్య చిలిపి చేష్టలకు తాళలేక రోటికి కట్ట ప్రయత్నించింది యశోదమ్మ. ఆమె తెచ్చిన తాడు కన్నయ్య ఉదరం చుట్టూ కట్టుటకు బెత్తెడు తక్కువైంది. మరల ఆమె కొంచెం తాడు సేకరించి మొదటి తాడుకు ముడి వేసినా చాలలేదు. అలా ఎన్ని తాళ్ళు జోడించినా కట్టడంలో సఫలీకృతురాలు కాలేకపోయింది. ఈ ప్రయత్నంలో యశోద పూర్తిగా అలసిపోవుటచే ఆమె చేత ఈ పర్యాయం ముడి వేయించుకున్నాడు. రోటిని అలా త్రాడుతో లాక్కెళ్ళి అక్కడ రెండు మద్ది చెట్లుగా వున్న నలకూబర మణిగ్రీవులకు శాప విముక్తి కలిగించాడు.
శ్రీకృష్ణుడు తన ఏడవ ఏటన గోవర్ధన గిరినెత్తి అందరినీ విస్మయపరిచాడు. తండ్రి నందయ్యకు నచ్చచెప్పి పూజలు ఆపుచేయగా ఇంద్రుడికి కోపం వచ్చింది. అతడు పెద్ద వర్షం కురిపించాడు. ఈ గోకులవాసులకు రక్షించుటను బాలకృష్ణుడు తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ దాని కిందకు చేర్చి, వారం రోజులపాటు అక్కడ వారిని ఉంచి రక్షించాడు. నీటిమడుగుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న ‘కాళియ హ్రద’ అనే పేరుతో జీవిస్తూ అడ్డూ అదుపూ లేకుండా ఉన్న కాళీయుడిని తానే స్వయంగా అణచివేశాడు. సంసారమనే మడుగులో పడి, అరిషడ్వర్గములనే విషమును కక్కుతూ శోక మోహంలో ఉన్న జీవులను, తన పాద స్పర్శ వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగచేసి అహంకారాన్ని తొలగించుటయే కాళీయ మర్దనం. అలాగే గోపికా వస్త్రాపహరణం. ప్రాతః కాలంలో యమునా నదిలో జలక్రీడలు ఆడుతున్న గోపికల వస్త్రములు అపహరించాడు. వారిని నీటి నుంచి వెలుపలకి వచ్చి వలువలు తీసుకోండని పలికాడు. గోపికలు మనసు దిట్టపరచుకుని నది నుండి వెలుపలకి వచ్చారు. కృష్ణునికి నమస్కరించి వారి వస్త్రములను తీసుకున్నారు. ఇందులో మనకు కనిపించేదేమంటే గోపికలనే జీవులు మాయ అనే వస్త్రం ధరించారు. (ఇంకా వుంది)