ఉగాది ఎలా జరుపుకోను?
ఆ దేశమనీ లేదు …… ఈ దేశమనీ లేదు
ప్రపంచమంతా కరోనా భయం
గుప్పెట్లో గజగజా వణుకుతోంది
ఇక ఉగాది ఊసెక్కడుంది?
చైనాలోని యూహాన్ లో పుట్టిందన్నారు
వయసుతో సంబంధం లేకుండా.
వీసా, పాస్ పోర్టులతో పనిలేకుండా
దేశాలన్నీ ఆక్రమించింది, విశ్వవిజేత అలెగ్జాన్ డర్ లా
అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ, బ్రెజిల్….
ఒక దేశమని కాదు, ఒక ప్రాంతమని కాదు….
భారత్ తో సహా పలు దేశాల్లో
విజయకేతనం. ఎగరేసింది కరోనా మహమ్మారి
శవాల గుట్టలతో నిండిపోయిన
అగ్రరాజ్యాల వీధులు. భయంతో అట్టుడికిపోయాయి
పారిశుద్ధ్యానికి భయపడిన. దేశాలు కకావికలు
అయ్యాయి …. ఇక ఉగాది. మాటేమిటి?
ధైర్యంతో. ముందడుగు. వేసింది. భారత్
పరిశోధనల పరంపర కొనసాగించింది
లాక్ డౌన్ ప్రక్రియతో జాగ్రత్తలు పాటిస్తూ
కోవాక్జిన్, కోవి షీల్డ్ లను ఆవిష్కరించింది
భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో
సమర్థవంతంగా వాక్సినేషన్ కనుగొంది
విజృంభస్తున్న కరోనా …. తోకముడిచి
పలాయన మంత్రం. పఠించింది
సమర్థవంతంగా సమృద్ధిగా తయారీయే కాదు
ఒక్క. భారత్ కే కాదు .. ప్రపంచ దేశాలకు
సైతం వాక్సిన్ సరఫరా చేసే స్థితికి చేరింది భారత్
విశ్వం వేనోళ్ళ. పొగిడింది భారతదేశ ప్రతిభను
రక్షణ కవచం – మాస్క్ లను ధరించండి
సామాజిక దూరం పాటించండి
గుంపులు గుంపులుగా చేరకండి
కరచాలనం వద్దండి – నమస్కారమే మన సంస్కారం
మొదటి డోసు వాక్సిన్ వేసుకోండి
మరో 28 రోజులకు రెండో డోసండి
కరోనా… కోవిడ్ … మీ దరిదాపులకు రావండి
ఆనందమయ జీవితాన్ని ఆహ్లాదంగా జరుపుకోండి
కరోనా రహిత, ఆనంద భరిత
జీవితానికి ఆహ్వానం. పలకండి
హాయిగా, ఆనందంగా గడుపుకోండి
ఇక ‘ఉగాది’ ని వేడుకగా
భయభ్రాంతులను పారద్రోలుతూ
ఉగాది పండుగను జరుపుకుందాం
నవ్య ఉగాది….. భవ్య ఉగాది ..
మన తెలుగువారి విజయానికి పునాది. …