అభిప్రాయవేదిక

అక్టోబర్ సంచిక చాలా బాగుంది. మీ సంపాదకీయం పత్రికకే హైలైట్. వాస్తవాలకు అద్దం పట్టేలాగా ఉంది. దుర్గ అమ్మవారి కవర్ ఫోటో బాగుంది
సంతోష్ కుమార్, లక్ష్మి – అమలాపురం
పత్రిక పదవ జన్మదిన శుభాకాంక్షలు. పత్రిక మొన్న మొన్ననే స్టార్ట్ అయినట్లు అనిపిస్తోది. అప్పుడే పదవ సంవత్సరంలోకి ప్రవేశించిందా అని ఆశ్చర్యంగా ఉంది. పత్రిక ఇలాగే దినదిన ప్రవర్ధమానం కావాలని ఆశిస్తున్నాం.
లక్ష్మణరావు, సరోజ – విజయనగరం
పత్రిక జన్మదిన సందర్భంగా తుమ్మూరివారి మరియు రాజ్యశ్రీ గారి కవితలు బాగున్నాయి.విడియో కూడా చాలా బాగుంది.
సుధాకరరావు, లాస్య – విజయవాడ
మురళీమోహన్ గారి విడియో బాగుంది. ఆయన మనసు విప్పి మాట్లాడారు. ఆ విడియో చూసాక ఆయన చెప్పిన గుండుగొల్లు నుంచి వెళ్ళే రోడ్డులో వెళ్ళాను. నిజంగానే కారు పెట్రోలు ఆదా అయింది. ఆయన లాగా పదవులలో ఉన్నవారందరూ ఇలా తలో కాస్తా మంచి పనులు చేస్తే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది కదా!
షణ్ముఖరావు, సామ్రాజ్యం – ఏలూరు
భువనచంద్ర గారు ఎస్ పి బి గారి గురించి చక్కగా చెప్పారు. చాలా మంచి విడియో మా పాఠక దర్శకులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
రామశర్మ,లలిత – విశాఖ
ఎలెక్ట్రాన్ వారి తిన్నింటివాసాలు కథ గొప్పగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి, అక్కడ జరిగిన పరిశోధనల ఫలితాలని తీసుకుని ప్రైవేట్ గా పరిశ్రమలు పెట్టుకుని కోట్లు గడించి, మన ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయటం ననం చూస్తూనే ఉన్నాం. చాలా చక్కగా వ్రాసారు రచయిత.
ప్రసాద్ – విజయవాడ
అరి షడ్వర్గాల గురించి విన్నాం గాని ఈ ప్రియ షడ్వర్గాలేమిటా అని అనుకుంటూ భువనచంద్ర గారి కధ చదివాను. చాలా గొప్పగా వ్రాసారు. రచయితకు అభినందనలు.
సాంబశివరావు, వెంకటలక్ష్మి- అమరావతి
పూరి జగన్నాధస్వామి వైభవం గురించి మురళీ కృష్ణ గారు చక్కగా వ్రాస్తున్నారు. స్థల పురాణం గురించి మాకు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు.
శ్యామలరావు, రుక్మిణి – కుకట్ పల్లి, హైదారాబాద్
సప్తమోక్ష నగరాలలో భాగంగా మధుర గురించి చక్కగా వ్రాస్తున్నారు రామానందం గారు. అక్కడ ఏమేమి చూడాలో ముందే తెలుసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఉపయోగకరం .
కృష్ణారెడ్డి , నీలిమ – నల్లకుంట
నండూరి సరోజ గారి ‘సినిమా’ బావుంది. రచయిత్రికి మా అభినందనలు.
సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి – వరంగల్
పాలకుర్తి రామమూర్తిగారి విద్యావిధానం పై విశ్లేషణ బాగుంది. మాకు ఉన్న సందేహాలు చాలామటుకు తీరాయి.
సుబ్బారావు, వనజ – రాజమండ్రి
బుచ్చిరాజుగారు మన రాష్త్రపతుల గురించి ధారావాహికంగా చక్కగా వ్రాస్తున్నారు.
నరసింహారావు, రమ – కరీం నగర్
గ్రీసు దేశపు పురాణ గాధలు మాకు అందిస్తున్నందుకు వేమూరిగారికి కృతజ్ఞతలు. ఎంతో ప్రాచీన సంస్కృతి ఉన్న గ్రీకు గాధలు తెలుసుకోవగలగటం మా అదృష్టం.
కేశవరావు, రాణీ – గుంటూరు
ఇంద్రగంటి గారి ప్రేమంటే ఇంతే చదువుతుంటే ఏదో ఒక చక్కని సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. రచయితకు అభినందనలు.
కృష్ణారావు, జలజ, నళిని – హైదరాబాదు
బాలుగారి గురించి పోడూరి గారు చక్కగా వ్రాసారు. మాకు ఎంతో నచ్చింది.
శంకరరావు, నరేష్ – నిజామాబాద్
హనుమంతుడి బుద్ధి కుశలత గురించి చక్కగా వివరించారు పద్యరత్నాలలో దంతుర్తివారు.
సతీష్, అనిత – ఖైరతాబాద్
ఆదూరివారి కధ బావుంది. అలాగే నందులవారి ధారావాహికం బాగుంటోంది. మంచి కధలు అందిస్తున్నందుకు మా ధన్యవాదాలు.
రాం ప్రసాద్, సుజాత – సైనిక్ పురి